స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. సీఎం ఏం చేయనున్నారంటే
అమరావతి, 13 జనవరి (హి.స.) ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన నారావారిపల్లెలో (Naravaripalle) పర్యటిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. కుటుంబ సభ్యులతో కల
నేడు చంద్రబాబు 75వ బర్త్ డే.. సంస్కరణలు, సాంకేతికత, స్థితప్రజ్ఞత కలబోసిన సుదీర్ఘ ప్రస్థానం


అమరావతి, 13 జనవరి (హి.స.)

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన నారావారిపల్లెలో (Naravaripalle) పర్యటిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భాగంగా సీఎం తన స్వగ్రామంతోపాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లె గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది.

​ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి దాదాపు రూ. 160 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నారావారిపల్లెలో రూ. 1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, 33/11 కేవీ సబ్ స్టేషన్, శేషాచల లింగేశ్వర స్వామి దేవాలయానికి నిర్మించిన బీటీ రోడ్డును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. అలాగే తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో నిర్మించిన బాలుర, బాలికల హాస్టల్ భవనాలను, రుయా ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన వసతి సముదాయాన్ని ప్రారంభించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande