
అమరావతి, 13 జనవరి (హి.స.)
కాకినాడ జిల్లాలోని సార్లంకలో ఘోర అగ్ని్ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 38కి పైగా తాటాకు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. ఈ దురదృష్టకర ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పండుగపూట ఇటువంటి బాధాకరమైన ఘటన బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపిందన్నారు.
బాధితుల పక్షాన నిలుస్తూ కాకినాడ జిల్లా సార్లంకలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు జరుగుతున్న వేళ ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. బాధితులకు అన్ని విధాల సహాయం చేయాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. వారు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV