
అమరావతి, 13 జనవరి (హి.స.)
ప్రజలంతా పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) ఆకాంక్షించారు. ధర్మవరం (Dharmavaram) పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో రథ మండపాన్ని (Ratha Mandapam) నిర్వహించారు. పనుల ప్రారంభోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. పూజాధికాల నిర్వహణ అనంతరం రథ మండప పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి (Sri Lakshmi Chenna Kesava Swamy Temple) ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతిని సాధించి సామాజికంగా మరింత ఎదగాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV