
నారావారిపల్లి, 16 జనవరి (హి.స.)అందరికీ పుట్టిన ఊరు జన్మభూమిపై మమకారం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అందుకే పీ4 ను తీసుకొచ్చామన్నారు. 10 లక్షల కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్నామన్నారు. సంక్రాంతి రైతుల పండుగని, పెద్దల పండుగ గా పూర్వీకులకు పూజలు చేసుకుని నివాళులు అర్పించాలన్నారు. రైతులు ఆనందం ఉన్నారని వారసత్వంగా జల్లికట్టు, కోడి పందేలు జరుపుకుంటున్నామన్నారు. చిన్నప్పుడు ఇవన్నీ సంప్రదాయంగా జరుకున్నామన్నారు. పండుగలు ఆనందాన్ని ఇస్తాయన్నారు.
పెద్దల పండగ సంక్రాంతిని సొంతూరు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబరంగా జరుకున్నారు. నాలుగు రోజుల పాటు నారావారి పల్లి లోనే కుటుంబ సభ్యులు బంధువులతో గడిపిన సీఎం సంక్రాంతి రోజు గ్రామ దేవత దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు, తల్లిదండ్రుల సమాధులకు పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నారా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV