
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) ఇంటర్నేషనల్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన ఇవాళ ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ (Bangkok) నుంచి నేరుగా జెడ్డా (Jeddah) వెళ్తున్న సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ (SV-845) విమానాన్ని వైద్య అత్యవసర కారణాల దృష్ట్యా పైలట్లు శంషాబాద్కు మళ్లించారు. విమానం గాలిలో ఉండగా, విమాన సిబ్బందిలో (Cabin Crew) ఒకరు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సదరు క్రూ సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు