కనుమ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు.. కేజీ ఎంతంటే..?
Andhra Pradesh, 16 జనవరి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. కనుమ పండుగ కారణంగా ధరలు ఆకాశాన్నంటాయి. పండుగ పూట ప్రతీఒక్కరి ఇళ్లల్లో నాన్ వెజ్ వంటకాలు వండుకుంటారు. ఇంటికొచ్చే అతిధులకు రకరకాల వంటకాలు వడిస్తారు. ప్రస్తుతం తెలు
Prices of chicken and mutton have increased in the


Andhra Pradesh, 16 జనవరి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. కనుమ పండుగ కారణంగా ధరలు ఆకాశాన్నంటాయి. పండుగ పూట ప్రతీఒక్కరి ఇళ్లల్లో నాన్ వెజ్ వంటకాలు వండుకుంటారు. ఇంటికొచ్చే అతిధులకు రకరకాల వంటకాలు వడిస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజు కనుమ సందర్బంగా ఇంట్లో ప్రతీఒక్కరూ నాన్ వెజ్ వంటకాలు తింటారు. దీంతో పండుగ డిమాండ్ కారణంగా చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ మటన్ రూ.1000 పలుకుతుండగా.. కేజీ చికెన్ రూ.300కిపైగా ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం కేజీ చికెన్ రూ.200 నుంచి రూ.250 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.300 దాటింది. ఇక నాటుకోళ్లకు అయితే ఫుల్ డిమాండ్ పెరిగింది. కేజీ నాటుకోడి రూ.2 వేల వరకు పలుకుతోంది.

ఇక కేజీ బోన్ లెస్ మటన్ రూ.1250 పలుకుతుంది. పండగ డిమాండ్ ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల రేటు పెరిగిందని యజమానులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో మరో 10 రోజుల్లో మేడారం జాతర ఉంది. దీంతో చికెన్, మటన్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పెరిగిన ధరలతో సామాన్యులు షాక్ అవుతున్నారు.

ఇక ఇవాళ కేజీ మటన్ బెన్ లెస్ రూ.1250పైగా పలుకుతోంది. సాధారణ రోజుల్లో కేజీ మటన్ రూ.800 వరకు ఉంటుంది. కానీ ఇప్పడు పండుగ కారణంగా ఏకంగా రూ.200పైగా పలికింది. ఇక చికెన్ ధర కూడా రూ.100 పెరిగింది. దీంతో కనుమ రోజు నాన్ వెజ్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనుమ రోజు నాటుకోళ్లను గ్రామ దేవతలకు మొక్కుగా చెల్లించే సాంప్రదాయం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నాటుకోడి ఎక్కువగా పండుగ రోజు తింటూ ఉంటారు. దీంతో నాటుకోడికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కేజీ నాటుకోడి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పలుకుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande