ఏపీ, తెలంగాణ జల వివాదాలపై కమిటీ.. ఈ నెల 30వ తేదీన తొలి భేటీ
హైదరాబాద్, 16 జనవరి (హి.స.) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవా భవన్లో మధ్యాహ్నం 30 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో)
జల వివాద కమిటీ


హైదరాబాద్, 16 జనవరి (హి.స.)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవా భవన్లో మధ్యాహ్నం 30 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో), సీడబ్ల్యూసీ సమావేశ నోటీసును జారీ చేసింది.

పోలవరం – నల్లమలసాగర్ ప్రాజెక్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( GRMB), కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande