
న్యూఢిల్లీ, 16 జనవరి (హి.స.)
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు
నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ నేడు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. సాయంత్రం 4గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. సాయంత్రం 5గంటల నుండి 6 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 6.30 నిమిషాలకు జాతీయ ఎన్నికల అధికారి ద్వారా ప్రకటన విడుదల కానుంది. 19న నామినేషన్ల ప్రక్రియ అనంతరం 20న అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు