సదర్ మట్ బ్యారేజ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
నిర్మల్, 16 జనవరి (హి.స.) నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ. 576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్ ను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారేజ్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి
సీఎం రేవంత్ రెడ్డి


నిర్మల్, 16 జనవరి (హి.స.) నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ. 576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్ ను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారేజ్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిమోట్ స్విచ్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు. బ్యారేజ్ వద్దకు వెళ్లడానికి పాసులు ఉన్న వారినే అనుమతించారు ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా ముఖ్యమంత్రి పర్యటన ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు .ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బొజ్జు పటేల్, సంజయ్ కుమార్,రామారావు పటేల్,సర్పంచ్ చిట్యాల లక్ష్మి, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్,ఎస్పీ జానకి షర్మిల, ఆయా శాఖల అధికారులు ,నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande