సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్లు.. హై అలర్ట్‌లో భార
ఢిల్లీ,16, జనవరి (హి.స.) జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్లు.. హై అలర్ట్‌లో భార


ఢిల్లీ,16, జనవరి (హి.స.) జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, డ్రోన్ నిరోధక చర్యలను ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.

ఈ వారంలో సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande