
ముంబై, 16 జనవరి (హి.స.)
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతుంది. బీజేపీ-శివసేన కూటమి 119 స్థానాల్లో.. థాక్రే కూటమి 70 స్థానాల్లో దూసుకెళ్తాంది. మొత్తానికి ముంబై మేయర్ పీఠాన్ని మహాయతి కూటమి సొంతం చేసుకోబోతుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరాఠీలు అధికార కూటమికే పట్టం కట్టారు. ముంబైతో పాటు 29 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుంది. ముంబైలో మొత్తం 227 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం కూటమి మెజార్టీ మార్కు దాటేసింది. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ... బాణాసంచా కాలుస్తూ వేడుకలు చేసుకుంటున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు