
హైదరాబాద్, 16 జనవరి (హి.స.) హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్ లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. మంత్రి ప్రయాణించిన హాట్ ఎయిర్ బెలూన్ గోల్ఫ్ క్లబ్ నుంచి ఎగిరి అప్పాజీగూడ శివారులో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ అనుభూతి అద్భుతమని, 'డెస్టినేషన్ తెలంగాణ' బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జనవరి 18 వరకు ఈ వేడుక కొనసాగనుందని చెప్పారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఇది సరికొత్త అధ్యాయం అని తెలంగాణ బ్రాండ్ బలోపేతమే తమ లక్ష్యం అన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..