
వేములవాడ, 16 జనవరి (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని సమ్మక్క సారక్క ఆలయంతో పాటు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న మంత్రి స్వామివారికి కోడె మొక్కలు చెల్లించుకొని, ప్రత్యేక నిర్వహించారు. అనంతరం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమ్మక్క సారక్క, రాజన్న ఆలయాలతో పాటు ఏ ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సామాన్య భక్తుల మనోభావాలను గుర్తించి ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..