
ములుగు, 16 జనవరి (హి.స.) మేడారం మహాజాతరకు
వచ్చే భక్తులు పరిశుభ్రత పాటించాలని, శుభ్రతే దైవంగా పాటిస్తూ పరిసరాలు అపరిశుభ్రంగా మారకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. మహా జాతరకు వచ్చే భక్తులు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, శుద్ధమైన నీటిని తీసుకోవడంతో పాటు వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన ఆనందమయ సమాజం నిర్మాణం కోసం మేడారం జాతర వంటి మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పరిశుభ్ర వాతావరణం భక్తుల విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు