
హైదరాబాద్, 16 జనవరి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ అరెస్టు విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు నమోదు అయింది. రమేశ్ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మీడియా వ్యక్తులపై దౌర్జన్యం కింద ఎన్హెచ్ఐసీ ఆర్లో కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉండగా తన అరెస్టు విషయంలో దొంతు రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. విచారణకు రాకుండా విదేశాలకు పారిపోతుండగా అరెస్టు చేశామని పోలీసులు చేసిన వాదనను ఖండించారు. సంబంధం లేని ఒక వార్తా కథనానికి, నాకు లింకు పెడుతూ నన్ను అరెస్టు చేశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..