
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల విషయమై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుకై జీవో ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం, పారదర్శకంగా అమలు చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు