
నల్గొండ, 16 జనవరి (హి.స.)
సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకేసారి హైదరాబాద్ నగరానికి భారీగా వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. దీనికోసం నల్లగొండ జిల్లా పోలీసులు ప్రత్యేక రూట్లతో పంపిస్తున్నారు. వాహనదారులు గమనించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ)పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలున్నాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు తాము చూపించిన మార్గాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు