
అంబేద్కర్ కోనసీమ జిల్లా 16 జనవరి (హి.స.)
:జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నేడు (శుక్రవారం) ప్రసిద్ధమైన ప్రభల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవం కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 450 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ ఉత్సవంలో ఏకాదశ రుద్రుల ప్రభలు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా జగ్గన్నతోటకు తరలిరానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ