
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
తెలంగాణ రైతులకు న్యాయమైన ధర కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. తెలంగాణలో 4,99,393 ఎకరాల్లో కందులు సాగు చేశారని తెలిపారు. క్వింటాల్ కందులకు ఎమ్ఎస్పీ రూ.8 వేలుగా ఉందని అన్నారు. మార్చి 2026 వరకు కందుల కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ఈసారి రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..