
నిజామాబాద్, 16 జనవరి (హి.స.) చట్టసభల రాజ్యాంగ హక్కులను
రక్షించాల్సిన అసెంబ్లీ స్పీకర్ భక్షకుడుగా మారడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. స్పీకర్ జడ్జిమెంట్ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర చట్టసభల గౌరవాన్ని దిగజార్చిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయింపు చేసినప్పటికీ, అనర్హత వేటు వేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా మారిందని అభిప్రాయ పడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు