
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
హైదరాబాద్లో సంక్రాంతి సంబురాలు
అంబురాన్ని తాకాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు రంగు రంగుల పతంగ్లను ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో ఆకాశంలో ఎక్కడ చూసినా గాలిపటాలే కనిపించాయి. బిల్డింగ్లపై డీజేలు పెట్టుకుని, ఎండ పడకుండా టెంట్లు వేసుకుని మరీ పతంగ్లను ఎగరవేశారు. ప్రతి ఏడాది కేవలం యువత మాత్రమే ఎక్కువగా కనిపించేవారు కానీ ఈ ఏడాది చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పతంగ్లు ఎగరవేశారు.
బేగంబజార్, దూల్ పేట్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే రాత్రైనా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి పతంగ్లు ఎగరవేస్తూనే ఉన్నారు. ఒకరి పతంగ్ లు మరకొరు కట్ చేస్తూ పార్టీలు చేసుకున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి మరీ ఎగరవేయడంతో చీకటి మాయమై పగటిపూట మాదిరిగానే కనిపించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..