
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య ఇంట విషాదం నెలకొంది.. ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వయో భారం కారణంగా గత రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు రేపు (శనివారం) జరగనున్నాయి. గత ఏడాదిగా తల్లి దగ్గరే ఉంటున్న ఇన్నయ్య ఎన్ఐఏ కేసులో ఇటీవల అరెస్టు అయి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఉపా (UAPA) చట్టం కింద అరెస్టు చేశారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..