
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా.. లేక తామే నిర్ణయం తీసుకోవాలా అంటూ ధర్మాసనం రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇదే కేసులో తాజాగా తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయంm తీసుకోవాలని సుప్రీంకోర్టే చెప్పిందని, ఏ ఒక్క ఆదేశాన్ని పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, ఎంపీగా కూడా పోటీ చేశానని అంగీకరించిన వ్యాఖ్యలను ఏలేటి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ప్రస్తుతం ఆయన దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పెండింగ్లో ఉంది. విచారణ తేదీ విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు