సంక్రాంతి.పండుగ రోజున గాజువాకలో చోరీ
విశాఖపట్నం, 16 జనవరి (హి.స.) :సంక్రాంతి పండుగ రోజున గాజువాకలో చోరీ జరిగింది. ఈ చోరీని 24 గంటల్లోనే గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సందర్భంగా వైజాగ్ షాపింగ్ మాల్‌లో ఏ వస్తువైనా రూ.180కే అంటూ భారీ సేల్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ఓ మహిళ
సంక్రాంతి.పండుగ రోజున గాజువాకలో చోరీ


విశాఖపట్నం, 16 జనవరి (హి.స.)

:సంక్రాంతి పండుగ రోజున గాజువాకలో చోరీ జరిగింది. ఈ చోరీని 24 గంటల్లోనే గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సందర్భంగా వైజాగ్ షాపింగ్ మాల్‌లో ఏ వస్తువైనా రూ.180కే అంటూ భారీ సేల్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ఓ మహిళ షాపింగ్‌ మాల్‌ లోపలికి వెళ్లే సమయంలో తన బ్యాగ్‌ను సెక్యూరిటీ వద్ద ఉంచింది. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్‌తో పాటు సెక్యూరిటీ వద్ద ఉంచిన మరో బ్యాగ్‌‌నూ దొంగలించాడు. ఆ బ్యాగ్‌లో రూ.50 వేల నగదుతో పాటు 11 తులాల బంగారం ఉన్నట్టు గుర్తించిన సదరు వ్యక్తి.. దాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande