దళితుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే కొనింటి మాణిక్
జహీరాబాద్, 16 జనవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆవేదన వ్యక్తం
ఎమ్మెల్యే కొనింటి మాణిక్


జహీరాబాద్, 16 జనవరి (హి.స.)

మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతును అణచి వేస్తుందన్నారు. 2011 జనాభా పరిగణలోకి తీసుకుంటూ చేసిన రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ క్యాటగిరి వార్డులను కుదించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande