లక్కుండిలో లంకె బిందెలు.. నిధి కోసం వేట మొదలు
బెంగళూరు,16,జనవరి (హి.స.) కర్ణాటకలోని చారిత్రక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే ). 634 గ్రాముల బరువున్న ఆ తామ్రపు చెంబులో 466 గ్రాముల బంగారు గాజులు, కడియాలు, గొలుసు, ఉంగరాలు బయటపడ్డాయి. దీంతో ఈ ప్రాంతం
లక్కుండిలో లంకె బిందెలు.. నిధి కోసం వేట మొదలు


బెంగళూరు,16,జనవరి (హి.స.) కర్ణాటకలోని చారిత్రక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే ). 634 గ్రాముల బరువున్న ఆ తామ్రపు చెంబులో 466 గ్రాముల బంగారు గాజులు, కడియాలు, గొలుసు, ఉంగరాలు బయటపడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో నిధి కోసం పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం అదేశించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అక్కడి అధికారులు లక్కుండిలో నిధి కోసం వేట మొదలుపెట్టారు .

లక్కుండిలోని కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిధుల కోసం పూర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రక్కులు, ట్రాక్టర్‌లను తరలించామన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్‌మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి. పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణేలను ముద్రించినట్లు ఆధారాలు ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande