వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా కుదరదు..!
ఢిల్లీ,16, జనవరి (హి.స.) జాతీయ రహదారులపై సాఫీగా ప్రయాణం సాగిపోవడానికి ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఫాస్టాగ్‌తో టోల్‌గేట్ల దగ్గర ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రయాణాలు సాగిపోతుంటాయి. అయినా కూడా కొందరు వాహనదారులు ఫాస్టాగ్ ఉన్న కూడా నగదు చెల్లించి ప్రయ
వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా కుదరదు..!


ఢిల్లీ,16, జనవరి (హి.స.)

జాతీయ రహదారులపై సాఫీగా ప్రయాణం సాగిపోవడానికి ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఫాస్టాగ్‌తో టోల్‌గేట్ల దగ్గర ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రయాణాలు సాగిపోతుంటాయి. అయినా కూడా కొందరు వాహనదారులు ఫాస్టాగ్ ఉన్న కూడా నగదు చెల్లించి ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. అయితే ఇకపై అలాంటి ప్రయాణాలు చేసే వారికి కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో నగదుతో ప్రయాణాలు చేయడానికి వీలుండదు.

టోల్‌ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా లేదా ఫాస్టాగ్ ద్వారానే ప్రయాణాలు చెల్లుబాటు అవుతాయి. ఈ రెండు లేకుండా నగదు చెల్లించి వెళ్తామంటే కుదరుదు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా.. రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ వెల్లడించారు.

హైవేలో పూర్తిగా డిజిటల్ విధానానికి మార్చినట్లుగా ఉమాశంకర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని టోల్‌ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులు నిలిపివేసినట్లుగా స్పష్టం చేశారు. టోలింగ్ వ్యవస్థను వేగవంతం, పారదర్శకంగా, నమ్మదగినదిగా చేసినట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande