పారిశుద్ధ్య కార్మికులకు ‘లలితా’ కిరణ్‌ సన్మానం
చెన్నై:/ ఢిల్లీ,16, జనవరి (హి.స.) తమిళనాడులోని చెన్నైలో నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఒక ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా నిలిచింది. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు నడిరోడ్డుపై ఒక బ్యాగు కనిపించింది. దానిలో సుమారు 200 గ్రాముల
పారిశుద్ధ్య కార్మికులకు ‘లలితా’ కిరణ్‌ సన్మానం


చెన్నై:/ ఢిల్లీ,16, జనవరి (హి.స.) తమిళనాడులోని చెన్నైలో నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఒక ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా నిలిచింది. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు నడిరోడ్డుపై ఒక బ్యాగు కనిపించింది. దానిలో సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఆ కార్మికులు మరో ఆలోచన చేయకుండా, ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి, తమ నిజాయితీని చాటుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ లలితా జ్యుయలరీ అధినేత కిరణ్ కుమార్ ఆ కార్మికుల నిజాయితీకి ఫిదా అయ్యారు. ఆయన సోషల్ మీడియాలో వారిని మెచ్చుకోవడమే కాకుండా, వారిని స్వయంగా తన నివాసానికి ఆహ్వానించారు. దీంతో మేరీ, పచ్చైయమ్మాల్, శంకర్ అనే ఈ ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఇంటికి వెళ్లారు. కిరణ్ కుమార్ వారికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన వారికి తన కుటుంబ సభ్యులతో పాటు విందు భోజనం ఏర్పాటు చేశారు. వారు సమాజానికి అందించిన స్ఫూర్తిని కొనియాడుతూ, వారికి నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande