నోట్ల కట్టల కేసు.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు చుక్కెదురు
ఢిల్లీ,16, జనవరి (హి.స.) నోట్ల కట్టల కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్‌ చట్టబద్ధ
Yashwant varma


ఢిల్లీ,16, జనవరి (హి.స.) నోట్ల కట్టల కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్‌ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జనవరి 8న రిజర్వ్‌ చేసిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఎస్‌సీ శర్మలతో కూడిన ధర్మాసనం నేడు వెలువరించింది.

గతేడాది జస్టిస్‌ యశ్వంత్‌వర్మ దిల్లీ హైకోర్టులో సేవలందిస్తున్నప్పుడు తన అధికారిక నివాసంలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. దానిపై అంతర్గత త్రిసభ్య సంఘం విచారణ జరిపింది. అది ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్‌ వర్మకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande