
మహబూబ్ నగర్, 16 జనవరి (హి.స.)
వేల కోట్ల రూపాయల నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా శుక్రవారం సభా ప్రాంగణ ఏర్పాట్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కలిసి పర్యవేక్షించి మాట్లాడారు. పాలమూరు ప్రజల ఎన్నో దశాబ్దాల కలలకు కార్యరూపం దాల్చనున్నదని, శనివారం జిల్లా కేంద్రంకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటించి 1465.32 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చేసే శంకుస్థాపనలతో చరిత్రలో ఒక మైలురాయిగా నిలువనున్నదని మంత్రి వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు