నగదు అక్రమ చలామణిలో మెహుల్‌ చోక్సీ కుమారుడు: ఈడీ
ఢిల్లీ,16, జనవరి (హి.స.)) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీ (Mehul Choksi) కేసుపై ఈడీ అధికారులు (ED) దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఈడీ అధికా
నగదు అక్రమ చలామణిలో మెహుల్‌ చోక్సీ కుమారుడు: ఈడీ


ఢిల్లీ,16, జనవరి (హి.స.)) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీ (Mehul Choksi) కేసుపై ఈడీ అధికారులు (ED) దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా కీలక విషయం వెల్లడించారు. ఈ మనీలాండరింగ్‌ కేసులో మెహుల్‌ ఛోక్సీ కుమారుడు రోహన్‌ చోక్సీ (Rohan Choksi)కి కూడా సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు దిల్లీలోని అప్పీలేట్ ట్రైబ్యునల్‌కు వివరాలు వెల్లడించారు.

మెహుల్ చోక్సీ డైరెక్టర్‌గా ఉన్న లస్టర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రోహన్ చోక్సీకి 99.99 శాతం వాటా ఉందని.. ఈ కంపెనీ నిధులను వారు విదేశాలకు మళ్లించడానికి ఉపయోగించుకున్నారని దర్యాప్తులో తేలినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నగదు అక్రమ చలామణి (money laundering)లో రోహన్ చోక్సీ చురుకుగా పాల్గొన్నట్లు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. దీంతో అతడి ఆస్తులను అటాచ్‌ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రోహన్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులను కూడా విచారించడానికి ఈడీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande