
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆ ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి యధావిధిగా మరో అటెన్షన్ డైవర్షన్ కుట్రకు తెరలేపారు. నా మీద సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నాను అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నారు. ఈ వార్తలను ప్రచారం చేయడం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.
అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు