మద్యం.కుంభకోణం లో.రిమాండ్ ఖైదీలుగానున్న 9 మందికి.30 వరకు.రిమాండ్
విజయవాడ , 17 జనవరి (హి.స.) , :మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న తొమ్మిది మందికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 30వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సజ్జల శ్రీ
మద్యం.కుంభకోణం లో.రిమాండ్ ఖైదీలుగానున్న 9 మందికి.30 వరకు.రిమాండ్


విజయవాడ , 17 జనవరి (హి.స.)

, :మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న తొమ్మిది మందికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 30వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, చెరుకూరి వెంకటేష్‌ నాయుడు, బూనేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణ, అనిల్‌ చోక్రా, రోణక్‌ కుమార్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్‌ను 30వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. బెయిల్‌పై ఉన్న పి.కృష్ణమోహన్‌ రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనంజయ్‌రెడ్డి మాత్రం వాయిదాకు హాజరుకాలేకపోతున్నామని ఆబ్‌సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande