
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) సికింద్రాబాద్లో నేడు బీఆర్ఎస్ నేతల అరెస్టుపై ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ నీ అయ్య జాగీరా? సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నాశనం చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డి పై దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. శాంతియుత ర్యాలీ చేయొద్దని గాంధీ చెప్పాడా? అని మండిపడ్డారు. ఇప్పుడు ర్యాలీలపై జులుం చూపిస్తున్న నువ్వు ఎన్నిసార్లు ర్యాలీలు చేయలేదని నిలదీశారు. సీఎం ఆఫీస్, ఈడీ ఆఫీస్ల దగ్గర ధర్నాలు చేయలేదా? అని ప్రశ్నించారు. పోలీసులను ఉసిగొల్పి అడ్డమైన కేసులు పెడతారా? అని కాంగ్రెస్ సర్కార్పై దాసోజు శ్రవణ్ ఆగ్రహం వక్తం చేశారు. అక్రమంగా జర్నలిస్టులను అరెస్టు చేయించారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు