
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ గా నామకరణం చేస్తే.. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ టీజీ గా మార్చిందన్నారు. దాంతో ఏవరి జీవితాలు మారాయో.. ఎవరికి ఆనంద కలిగిందో తెలియదని అన్నారు. తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రక నగరం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన పాలన 'పిచ్చోడి చేతిలో రాయిలా' మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు