
జెరూసలేం 07 జనవరి (హి.స.)
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జెరూసలేంలో సైనిక నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. వేలాది మంది హాజరైన ప్రదర్శనలో పురుషుల గుంపుపైకి ఓ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో దాదాపు పదిమంది యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు