
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)
దేశ బహిష్కరణకు గురైన వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తిరిగి స్వదేశానికి రానున్నట్టు ప్రకటించారు. ఆమె తిరిగి వెనిజులాకు వస్తే దేశ రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రమే కాకుండా, 2025 నోబెల్ శాంతి బహుమతి పొందిన మచాడో ప్రస్తుతం అర్జెంటీనాలో తలదాచుకుంటోంది. జనవరి 3న అమెరికా స్పెషల్ ఫోర్సెస్ వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి న్యూయార్కు తీసుకెళ్లిన తర్వాత మచాడో మీడియాతో మాట్లాడుతూ.. తాను వెంటనే వెనెజులాకు వెళ్లి ప్రజాస్వామ్య బద్దమైన ఎన్నికలు నిర్వహిస్తాను అని ప్రకటించింది.
అయితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమెను పోటీకి అనర్హురాలిగా మద్దతుదారులు ప్రకటించినప్పటికీ, ప్రతిపక్ష ఆమెనే నిజమైన విజేతగా భావిస్తున్నారు. 2023లో జరిగిన ప్రతిపక్ష ప్రైమరీల్లో ఆమెకు 93 శాతం మద్దతు లభించడం ఆమెకు బలమైన ప్రజాదరణ ఉందని నిరూపించింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు