
తిరుమల, 10 అక్టోబర్ (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగుతోంది.
దేశ నలుమూలల నుంచి తరలివస్తున్న వేలాది మంది భక్తులతో శ్రీవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
ఈ రోజు శనివారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం పూర్తి కావడానికి దాదాపు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను టీటీడీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు నిన్న శుక్రవారం రోజంతా కలిపి మొత్తం 68,187 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 23,923 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.4.55 కోట్లు సమకూర్చినట్లు ఆలయ అధికారులు పత్రికా ప్రకటణ ద్వార అధికారికంగా తెలిపారు. ---------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV