విజయవాడలో డ్రగ్స్ కలకలం
విచ్చలవిడిగా జరుగుతున్న డ్రగ్స్ విక్రయాలపై విజయవాడ పోలీసులు పంజా విసిరారు
drugs


విజయవాడ , 14 అక్టోబర్ (హి.స.)

విచ్చలవిడిగా జరుగుతున్న డ్రగ్స్ విక్రయాలపై విజయవాడ పోలీసులు పంజా విసిరారు. డ్రగ్స్ రవాణా, విక్రయాలపై సమాచారం అందుకున్న విజయవాడ ఈగల్, జీఆర్పీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ రవాణా గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో ఓ యువతి నుంచి 110 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. యువతికి డ్రగ్స్ ఎలా లభ్యమయ్యాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేయగా.. బెంగుళూరు నుంచి డ్రగ్స్ను రైలులో విజయవాడకు తీసుకువచ్చి.. విక్రయాలు జరుపుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు ఈ డ్రగ్స్ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande