
మహబూబ్నగర్, 14 అక్టోబర్ (హి.స.)
మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న రీ సర్వే పనులను జిల్లా అదనపు కలెక్టర్ హరిప్రియ బుధవారం పరిశీలించారు.జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రత్యేక బృందాలతో చేపడుతున్న రీ సర్వే పనులను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు. ఈ పరిశీలనలో జడ్చర్ల తహసీల్దార్, నర్సింగ్ రావు డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు.పనుల పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, కొత్తగా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చిన రెండు రీ సర్వే బృందాల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకుని పనులను వేగవంతం చేయాలని అధికారులను, మండల సర్వేయర్ ను ఆదేశించారు. రీ సర్వే పనుల పురోగతిని జిల్లా యంత్రాంగం రోజువారీగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
అనంతరం గ్రామస్తులు, రైతులతో మచ్చటించిన ఆమె, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వివరించారు. కచ్చితమైన భూ కొలతలు, సరిహద్దుల నిర్ధారణ కోసం ఆధునిక రోవర్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రీ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత భూ యజమానులకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (LPM) అందజేస్తామని, దీని ద్వారా భవిష్యత్తులో భూ సరిహద్దులు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన వివాదాలను నివారించవచ్చని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..