జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Chairman


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నేడు నల్గొండలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలని కోరారు. ఎదుళ్ల రిజర్వాయర్ నీటి కేటాయింపులపై అనవసర వివాదాలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడం తగదని, ప్రజాప్రతినిధులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలిజల వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యంవర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న దృష్ట్యా రైతులు నీటిని, విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande