రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఈడీ నోటీసులు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో భాగంగా, హైదరాబాద్లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ED


అమరావతి , 14 అక్టోబర్ (హి.స.)రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో భాగంగా, హైదరాబాద్లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో రూపొందించిన నూతన మద్యం విధానం, మద్యం బ్రాండ్ల ఆమోదం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రజత్ భార్గవను పలుమార్లు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande