
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) ఫిబ్రవరి 11నుంచి 13వరకు జరగనున్న కొలన్పాక జైన్ ఆలయం 1400వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆలేరులో 5రైళ్లకు తాత్కాలిక స్టాపేజీ సదుపాయం కల్పించినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. వేడుకలు జరిగే రోజుల్లో 12727/28 విశాఖపట్నం- హైదరాబాద్- విశాఖపట్నం, 12759 తాంబరం- హైదరాబాద్- తాంబరం,22737 సికింద్రాబాద్- హిస్సార్ ప్రత్యేకరైళ్లు ఆలేరు స్టేషన్లో నిమిషం పాటు ఆగుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. వేడుకలకు హాజరయ్యే భక్తులు ఈ తాత్కాలిక స్టాపేజీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్