హైదరాబాద్లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వల.. గురూజీపై కేసు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఆధ్యాత్మికత పేరుతో శ్రీ చైతన్య గురూజీ అలియాస్ సునీల్రెడ్డి ఓ మహిళను వేధించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విష్ణుదీప్రెడ్డి కాపురంలో అతను చిచ్చుపెట్టాడు.
Baba


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

ఆధ్యాత్మికత మరియు ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఓ మహిళను వేధింపులకు గురిచేస్తున్న శ్రీ చైతన్య గురూజీ అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-71లోని 'శ్రీవిద్యా సాధనా సెంటర్' నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న సునీల్‌రెడ్డి, సాధనల పేరుతో తమ కుటుంబంలో అలజడి సృష్టించాడని బాధితురాలి భర్త, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విష్ణుదీప్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహమైన కొన్ని నెలల నుంచే తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను ఏమాత్రం పట్టించుకోవడం మానేసిందని విష్ణుదీప్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై దృష్టి సారించగా, శ్రీవిద్యా సాధనా సెంటర్ నిర్వాహకుడు సునీల్‌రెడ్డి తన భార్యకు ఆధ్యాత్మిక శిక్షణ నెపంతో నిత్యం అసభ్యకరమైన మెసేజ్లు, అభ్యంతరకరమైన వ్యక్తిగత చాటింగ్‌లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నట్లు గుర్తించారు.

తన భార్య కాపురంలో నిప్పులు పోస్తూ వేధింపులకు పాల్పడుతున్న సునీల్‌రెడ్డిని నిలదీయగా, అతడు ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా చంపేస్తానని బెదిరింపులకు దిగాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విష్ణుదీప్‌రెడ్డి సదరు అసభ్యకర చాటింగ్ ఆధారాలు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు మేరెడ్డి సునీల్‌రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 351(2) (నేరపూరిత బెదిరింపులు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande