తమకు జీతాలు ఇవ్వాలంటూ ఆస్పత్రి ఎదుట కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్న నిరసన!
తమకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు నేడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
Salary

మహబూబ్నగర్, 14 అక్టోబర్ (హి.స.)

తమకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు నేడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఆసుపత్రి ముందే బతుకమ్మ ఆడుతూ తాము పడుతున్న బాధలను బతుకమ్మ పాట రూపంలో పాడుతూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. అందరూ పండగలు చేసుకుంటుంటే తాము తమ పిల్లలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చేతిలో డబ్బులు లేక పండగ చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande