విద్యుత్ కోతలపై మెదక్ జిల్లా రైతుల ఆందోళన
విద్యుత్ కోతల కారణంగా పంటలకు సకాలంలో నీరు అందక ఎండిపోయే పరిస్థితి పై గ్రామ రైతులు ఆందోళనకు దిగారు
Farmers


మెదక్, 14 అక్టోబర్ (హి.స.)విద్యుత్ కోతల కారణంగా పంటలకు సకాలంలో నీరు అందక ఎండిపోయే పరిస్థితి

పై మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వారు నినాదాలు చేశారు. వ్యవసాయ సాగు కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని కోరుతూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్ కోతలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ బోర్ల పై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పొలాలకు నీరు అందించలేక పోతున్నామని పేర్కొన్నారు. పంటలు ఎండిపోకుండా ఉండాలంటే కనీసం 15 రోజుల పాటు నిరంతరయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను కోరారు. తమ సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande