పేదల గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం..
'ఇందిరమ్మ ఇళ్ల' పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నివాస పథకం పీఎం ఆవాస్ యోజన (PMAY)తో అనుసంధానించాలని నిర్ణయించింది.
తెలంగాణ


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

పేదల గృహ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఇందిరమ్మ ఇళ్ల' పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నివాస పథకం పీఎం ఆవాస్ యోజన (PMAY)తో అనుసంధానించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే మొదటి విడత కింద ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన 1.75 లక్షల ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అధికారులు పీఎం ఆవాస్ యోజన (PMAY) అధికారిక పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేశారు. ఆ వెంటనే రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మట్టి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్న మరో 25 వేల మంది లబ్ధిదారులను కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకు రానున్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కోటా ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.72,000 నిధులు జమ కానున్నాయి. అయితే, పీఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 2 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఒక్కో ఇంటి నిర్మాణం కోసం కేంద్రం రూ.72 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande