అంతర్-రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ను పోలీసులు అరెస్టు
కడప జిల్లాలో పోలీసులపై ఎర్రచందనం స్మగర్లు దాడికి పాల్పడ్డారు
అంతర్-రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ను పోలీసులు అరెస్టు


కడప, 14 అక్టోబర్ (హి.స.)కడప జిల్లాలో పోలీసులపై ఎర్రచందనం స్మగర్లు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని ఎస్.ఏ.కాశినాయన మండలం వద్ద అటవి ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు ఎనిమిది మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొంతమంది స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు జిల్లాలలో శేషాచలం అటవీ ప్రాంతంలో విస్తరంగా ఉన్న ఎర్రచందనం చెట్లను కొట్టిస్తున్నారు. వాటిని అక్రమంగా బెంగళూరుకు తరలించి, అక్కడ నుంచి ఓడరేవుల ద్వారా దుబాయి, వియత్నాం, కొలంబో, చైనాకు తరలించి లాభాలు గడించేవారు.శేషాచలం అటవీ ప్రాంతంలో విస్తరంగా ఉన్న ఎర్రచందనం చెట్లను కొట్టించి, వాటిని అక్రమంగా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్న నిందితులను పట్టుకున్నారు.

జిల్లాలో ఎనిమిది మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్లవారి వద్ద నుంచి దాదాపు 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాఫీ పొడి ప్యాకెట్ల లోడు మాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మూడు వాహనాలతో పాటు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని అంచనా. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారంటూ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.,ఎస్.ఏ.కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో వాహనాలను తనిఖీలు చేశారు.

ఈ క్రమంలో కాఫీ పొడి ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.లారీతో పాటు ఎర్రచందనం దుంగలను సీజ్ చేశామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande