
భూపాలపల్లి, 15 అక్టోబర్ (హి.స.)
ఒకప్పుడు 600 ఓట్లతో గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లి నేడు లక్ష జనాభాతో జిల్లా కేంద్రంగా ఎదిగిందని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.
భూపాలపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులు..అంబేద్కర్ జంక్షన్ నుంచి ఓసీ-2 వరకు 200 అడుగులు, అంబేద్కర్ జంక్షన్ నుంచి సింగరేణి గ్రౌండ్ వరకు 80 అడుగుల రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గతంలోనే భూసేకరణ జరిగినప్పటికీ ఆక్రమణల కారణంగా రహదారుల విస్తరణకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీకి రూ.73 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..