ఎల్నినో ప్రభావంపై ప్రభుత్వ దృష్టి.. సింగూరు, మంజీరా జలాశయాలను పరిశీలించిన సీఎస్
తెలంగాణలో రానున్న కాలంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Telangana govt


హైదరాబాద్ , 15 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో రానున్న కాలంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సింగూరు, మంజీరా జలాశయాలను సందర్శించి నీటి లభ్యతను పరిశీలించారు. ఎల్నినో ప్రభావం రాష్ట్రంలోని నీటి వనరులపై చూపే అవకాశాలను అంచనా వేయడం, ప్రత్యామ్నాయ నీటి సరఫరా ప్రణాళికల అమలును సమీక్షించారు.

తెలంగాణలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో జలాశయాల్లో నీటి నిల్వలను పర్యవేక్షించడం ప్రభుత్వానికి కీలకమైన బాధ్యత. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరంతోపాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు తాగునీటిని అందించడంలో నీటి వనరుల నిర్వహణకు ప్రాధాన్యం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande